నేటి గదర్, జూన్ 07, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
అలవాల వంశీ 9052354516
2024 – 25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ గిరిజన సంక్షేమ మినీ గురుకులం బాలికల విద్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాకలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు, రెండవ తరగతి నుంచి 5 వ తరగతిలో మిగిలిన బ్యాక్ లాగ్ సీట్ల ప్రవేశంనకు అర్హత కలిగిన స్థానిక గిరిజన విద్యార్థినిల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పినపాక మండల ప్రాంతంలోని విద్యార్థినిలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని, స్థానిక విద్యార్థినిలు లేనియెడల సమీప మండలాల విద్యార్థినిలకు ప్రవేశమునకు రెండవ ప్రాధాన్యత ఇవ్వబడునని, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన గిరిజన విద్యార్థినిలు తమ దరఖాస్తును పినపాక మినీ గురుకులం ప్రధానోపాధ్యాయురాలికి అందజేయాలని పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుండి 18 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేయడానికి అభ్యర్థి రెండు పాస్ ఫోటోలు, అభ్యర్థి సంతకం, ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ పొందుపరచాలని ఆయన తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయుట జరుగునని, ఈ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, (CBSE) సిలబస్ లో విద్యాబోధన కలదని, ఒకటవ తరగతిలో 30 సీట్లు, ఐదవ తరగతిలో ఒక సీటు కలదని, అధికారి ఖమ్మం రీజియన్ ప్రాంతీయ సమన్వయ వెంకటేశ్వరరాజు తెలిపారు.