+91 95819 05907

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి…

యు.పి.ఎస్ కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్.

నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 7:
నైనారపు నాగేశ్వరరావు✍️

మణుగూరు మండల కేంద్రంలోని కూనవరం లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో రెండవ రోజు జూన్ 7న ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ ఆధ్వర్యంలో టీచర్స్ టీం కూనవరం గ్రామంలో ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు.కరపత్రాల పంచుతూ, విద్యార్థినీ,విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ,నినాదాలు చేస్తూ,ర్యాలీ నిర్వహించరు.తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించారు. తొలుత కూనవరం నుండి అంగన్వాడి కేంద్రంను సందర్శించి బడి ఈడు గల విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేసుకున్నారు.తరువాత విద్యార్థుల యొక్క ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ఒకటవ తరగతిలో విద్యార్థులను చేర్చుకున్నారు.అదే విధంగా ఏడవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను సమీప జిల్లా పరిషత్ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల మణుగూరులో జాయిన్ కావలసిందిగా తల్లిదండ్రులను కోరారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు టాయిలెట్స్ సౌకర్యం,విద్యుత్తు సౌకర్యాలను కల్పిస్తుందని ఆయన తెలిపారు. సంవత్సరానికి రెండు జతల ఏకరూప దుస్తులు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం మరియు నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందన్నారు.సామాజిక బాధ్యతగా అందరూ సర్కారు బడులలో విద్యార్థినీ,విద్యార్థులను పెంచుటలో భాగస్వామ్యం అయ్యి ప్రభుత్వ బడులను రక్షించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఏనిక ప్రమీల మరియు సభ్యులు,టీచర్ సారయ్య, హై స్కూల్ టీచర్లు ఆదినారాయణ, రత్నకుమార్,కృష్ణకుమారి,ఛాయాదేవి,క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ లక్ష్మి,అంగన్వాడి టీచర్ వీరకుమారి,ఆయా శశిరేఖ మరియు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

అశ్వారావుపేట అభివృద్ధికి రూ.15 కోట్లు: మౌలిక వసతులే లక్ష్యంగా మంత్రి పొంగులేటి భూమిపూజ

​పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎంపీ రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రకటన నేటి గద్దర్ న్యూస్,​అశ్వారావుపేట, జనవరి, 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మున్సిపాలిటీని సర్వాంగ

Read More »

గ్రామ వికాసమే ధ్యేయం: ఘనంగా ఇందిరమ్మ చీరలు, ఉపాధి పనిముట్ల పంపిణీ

ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, జనవరి, 12: మండలం పరిధిలోని అల్లిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా సోమవారం సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం

Read More »

వైరా పట్టణంలో ఇంటింటికి సిపిఐ(ఎం)

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా పట్టణంలో విసృతంగా ఇంటింటికి సిపిఐ(ఎం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ – 2 శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో

Read More »

విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలు __ పలువురు వక్తల ప్రవచనాలు

ఖమ్మం, జనవరి 11, నేటి గదర్ న్యూస్: విశ్వాసం నమాజ్ సదాచారాలు మోక్షానికి మార్గాలని , బహు దైవారాధన నరకానికి ప్రధాన ద్వారమని పలువురు వక్తలు ప్రసంగించారు. ఆదివారం ముష్టికుంట్ల గ్రామంలో ముస్లిం ఐక్య

Read More »

చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ: డిఎంహెచ్ఓ ధనాలకోట రామారావు

* నేటి గదర్ న్యూస్, చింతకాని : చింతకాని: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎంహెచ్ఓ రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన రికార్డులను పరిశీలించి

Read More »

 Don't Miss this News !