+91 95819 05907

ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించండి:డిప్యూటీ సీఎం

★వివిధ శాఖల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

★సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:
రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఏటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్ మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అందుకోవాలని వివరించారు. ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ టాక్స్ విభాగాల్లో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు, సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకొని, తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల సింగరేణిలో చేసిన ఈ ప్రయోగం ద్వారా వందల కోట్ల ప్రయోజనం చేకూరిన విషయాన్ని ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులకు వివరించారు. LRS దరఖాస్తులు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయి, ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైన ప్రగతి లేకపోవడానికి కారణాలు డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చాలని కోరారు. పూర్తిగా అర్హత ఉన్న స్థలాలకే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (LRS) అమలు చేయాలని, ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఈ పథకం కింద ప్రయోజనం పొందే ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ పథకాల ద్వారా నిర్మించిన ఇల్లు, వచ్చిన ఆదాయం వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ విక్రయించని ఇల్లు, ఇళ్ల స్థలాలు వాటి పరిస్థితిని సమీక్షించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సామాన్యుడు సంతృప్తి చెందడమే ప్రధాన లక్ష్యమని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను నెలవారి చెల్లించే పద్ధతిని ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు చేస్తున్న ప్యాకేజీల ధరలకే ప్రైవేటు ఆసుపత్రిలో ఆయా చికిత్సలు అందించేందుకు వారిని ఒప్పించాలని, ఈ పథకం సామాజిక బాధ్యతలో భాగమని వారికి వివరించాలని, వారితో చర్చలు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ టాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

వైరాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.

నేటి గదర్ న్యూస్, వైరా: వైరా :తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం

Read More »

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పరిధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా గౌరవనీయులైన మధుర

Read More »

Ponguleti:హలం పట్టి…. విత్తనాలు జల్లి…న మంత్రి పొంగులేటి★ యావత్ దేశ రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

రైతన్నలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి -అరక దున్ని…విత్తనాలు జల్లిన మంత్రి పొంగులేటి -కూసుమంచిలో ఏరువాక కార్యక్రమంలో రైతన్నలతో కలిసి పాల్గొన్న మంత్రి పొంగులేటి నేటి గదర్ న్యూస్,ఖమ్మం(కూసుమంచి): ఖమ్మం జిల్లా కూసుమంచిలో

Read More »

Mulugu:మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం

నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు): ములుగు జిల్లా: బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి

Read More »

15 రోజులలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి పొంగులేటి

కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని… ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలానికి చెందిన ముఖ్య నాయకులతో తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం,

Read More »

TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత

నేటి గదర్ వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత తొలిరోజు హైదరాబాద్ నుంచి

Read More »

 Don't Miss this News !