★మిషన్ భగీరథ సర్వే విజయవంతం చేయాలి.
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, (జూన్ 07):
ములుగు జిల్లాలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని, మిషన్ భగీరథ
సర్వే విజయవంతం చేయాలని
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిషన్ భగీరథ ఎస్ ఈ శ్రీనివాస్ రావు తో కలిసి మిషన్ భగీరథ సర్వే మొబైల్ అప్పీకేషన్ నిర్వహణ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామం లో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ముఖ్య ఉద్దేశం తో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ సర్వే కు శ్రీకారం చుట్టిందని ములుగు జిల్లా లో ఈ సర్వే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా విజయవంతం చేయాలని అన్నారు.
మిషన్ భగీరథ సర్వే లో సర్వేయర్ కు కేటాయించిన గ్రామాలలో ప్రతి ఇంటిని సర్వే చేయాలని , ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా లేదా , ఉంటే ఆ కుటుంబానికి సరిపడ నీరు అందుతుందా లేదా , కనెక్షన్ ఉన్నా కూడా నల్లా పని చేయకపోతే ఎందుకు పని చేయడం లేదు అనే అంశాలను పూర్తి వివరాలు మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ ఎస్ ఈ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మిషన్ భగీరథ సర్వే ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని నల్లా కనెక్షన్ తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని నల్లా కనెక్షన్ లేని గృహాలకు త్వరలోనే నల్లా కనెక్షన్లు అందించడం జరుగుతుంది తెలిపారు. ఈ సమావేశం లో మిషన్ భగీరథ
ఈ ఈ సుభాష్ , డి ఈ హజార్ , ములుగు ఎంపీడీవో రామకృష్ణ , ఎంపీఓ లు, ఏ ఈ లు , ఫిల్డ్ అసిస్టెంట్లు, వి వో ఏ లు తదితరులు పాల్గొన్నారు….