★పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి
నేటి గద్ధర్ న్యూస్ ,ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూసుమంచి మండలంలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మండలంలోని నాయకన్ గూడెం, భగత్ వీడు తండా, మంగళి తండా, ఈశ్వర మదారం, రాజుపేట బజార్, రాజు పేట, గోరిలపాడు తండా, హిరామాన్ తండా, పెరిక సింగారం, జక్కేపల్లి, జక్కేపల్లి ఎస్సీ కాలనీ, మల్లేపల్లి, గట్టు సింగారం, గంగబండ తండా, లింగారం తండా, కోక్యా తండా, లోక్యా తండా, నేలపట్ల, అగ్రహారం, మునిగేపల్లి గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని దయాకర్ రెడ్డి తెలిపారు.