నేటి గద్ధర్ న్యూస్,కారేపల్లి:
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు మరణం పట్ల మండల జర్నలిస్ట్ పూనేం సుమంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలందించారని తెలిపారు. రామోజీ రావు సినిమా రంగంలో, పత్రికా రంగంలో ప్రత్యేక ఒరవడిని తీసుకువచ్చారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రామోజీ ఫిలిమ్ సిటీ విశ్వవ్యాప్తం అయిందని గుర్తు చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిచ్చారని కొనియాడారు. సమాజ అభ్యున్నతి కోసం అనుక్షణం పనిచేశారాని, ఈనాడు గ్రూప్ సంస్థల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మహనీయుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి మండలం నుంచి ఒకరో ఇద్దరో రామోజీరావు సంస్థలో పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సక్సెస్ కు మారుపేరు రామోజీరావు . అన్నదాత పత్రిక ద్వారా రైతులకు కొత్త సాంకేతిక విధానం తెలిసేలా చేశారు. మార్గదర్శి ప్రియా పచ్చళ్ళు ద్వారా అనేకమందికి ఉపాధి కల్పించారు. రామోజీ ఫిలిం సిటీ ని స్థాపించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి గడించేలా చేశారు. ఎవరు ఎన్ని దాడులు చేయాలని చూసినా సంస్థలని మూసివేయాలని చూసినా తనదైన శైలిలో ముందుకు నడిచారు. అటువంటి మహనీయునికి శోక నివాళి అర్పించారు. రామోజీ రావు లాంటి గొప్ప వ్యాపారావేత్తను కోల్పోవడం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి కూడా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.