+91 95819 05907

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల డిమాండ్

నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 05:​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్న కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే పనుల కోసం పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటున్నప్పటికీ సాంకేతిక కారణాలతో తమ హాజరు ఆన్‌లైన్ కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా తీయాల్సిన ఫోటోలు సర్వర్ సమస్యల వల్ల సకాలంలో అప్‌లోడ్ కాకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో పని చేసినా కేవలం ఫోటోలు ఆన్‌లైన్ కాకపోవడం వల్లే తమకు రావాల్సిన రోజువారీ కూలీ డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉందని కూలీలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ ఫోటోల అప్‌లోడింగ్ మరియు నెట్‌వర్క్ సమస్యలతో సతమతమవ్వడం కంటే గతంలో మాదిరిగానే పాత పద్ధతిలోనే హాజరు నమోదు ప్రక్రియను కొనసాగించాలని కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొత్త యాప్ విధానం వల్ల పనులు సజావుగా సాగడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పద్ధతిని అమలు చేసి తమకు పని దినాలు మరియు కూలీ నష్టపోకుండా చూడాలని జమ్మిగూడెం గ్రామ ఉపాధి హామీ కూలీలు విన్నవిస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !