నేటి గద్ధర్ న్యూస్ ,న్యూ ఢిల్లీ :జూన్ 09
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా పలు వురు ఎంపీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజర య్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజర య్యారు.
జవహర్‌లాల్ నెహ్రూ తర్వా త వరుసగా మూడోసారి
విశాల భారతం…. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం..లెక్కకు మించిన కులమతాలు… విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు…. అనేక రాజకీయ వైరుధ్యాలు…. నేతలపై నమ్మకం కోల్పో తున్న ప్రజలు…రాజకీయా లపై ఓ విధమైన ఏహ్య భావం….
రాష్ట్రాలపై వారసత్వ కుటుంబాల ఆధిప త్యం….ప్రాంతీయ పార్టీలకు పెరుగుతున్న ఆదరణ…. ఉనికి కోల్పోతున్న జాతీయ పార్టీలు… ఇలాంటి పరిస్థితులున్న చోట…ఒకే ఒక్కడు… తానే ఓ గ్యారంటీ అని ప్రకటించి… ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిగెలి చారు.
నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయా నుకూల రాజకీయ నిర్ణయా లు తీసుకోవడంలోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహా లతో ఓట్లు రాబట్టుకోవడం లోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి..తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు.
అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకవ సరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు…