★రాజకీయ చాణక్యతతో ఎదిగిన బండి సంజయ్ కుమార్…
★అంచల్ అంచెలుగా ఎదుగుతూ ప్రజామన్నలను పొందుతున్న: బండి సంజయ్ కుమార్
నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి (కరీంనగర్) జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు ✍️
2005లో కరీంనగర్ పట్టణంలోని 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పోరేటర్ గా బండి సంజయ్ కుమార్ ఎన్నికయ్యారు.తన రాజకీయ చాణక్యతతో మళ్లీ 2005 నుండి 2019 వరకు ఈ కార్పోరేటర్ స్థానంలో ఆయన ప్రాతినిథ్యం వహించారు.2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించడంతో కార్పోరేటర్ పదవికి రాజీనామా చేశారు.2014,2018 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బండి సంజయ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. గెలుపు ఓటమీలను స్ఫూర్తిగా తీసుకొని అంచలంచలుగా ఎదుగుతూ ప్రజా మన్నలను పొందుతూ,మళ్లీ 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను 2020 మార్చి 11న ఆ పార్టీ నియమించింది. తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ,ప్రజల్లో ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ కీలకంగా వ్యవహరించారు.కానీ,సంస్థాగత మార్పుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బిజెపి పార్టీ నాయకత్వం కిషన్ రెడ్డికి అప్పగించింది.ఆ తరువాత 2023 నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా పని చేస్తున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు.ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కరీంనగర్ ప్రజలు,రాష్ట్ర బీజేపీ నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.