– ITDA PO ప్రతీక జైన్
నేటి గదర్, జూన్ 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
2022-24 విద్యా సంవత్సరానికి గాను కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన బీఈడీ ఫైనల్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో గిరిజన బీఈడీ కళాశాల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో చివరి సెమిస్టర్ పరీక్షలకు 94 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారిలో అందరూ విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారని ఆయన అన్నారు. అందులో 7.79 CGPA తో కొప్పు మౌనిక ప్రథమ స్థానంలో, 7.76 CGPA తో వాంకు డోత్ సంతోష్ కుమార్ ద్వితీయ స్థానంలో, 7.68 CGPA పునేమ్ తనుజ ద్వితీయ స్థానం సాధించారని పిఓ వెల్లడించారు. యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషిచేసిన కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్ ను, అధ్యాపకులను, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ తో పాటు ఐ టి డి ఓ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక జైన్ అభినందించారు.