– ITDA PO పతిక్ జైన్
నేటి గదర్, జూన్ 10,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
అలవాల వంశీ 9052354516
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల నుండి ఉపాధ్యాయ శిక్షణ కొరకు గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశం పొందుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాల రాష్ట్రంలోనే అత్యుత్తమ శిక్షణ కళాశాల గా గుర్తింపు పొందిందని, కళాశాలలో విద్యార్థుల హాజరు 100% ఉంటుందని, ఉపాధ్యాయ పోటీ పరీక్షలలో కూడా గిరిజన బీఈడీ కళాశాలలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రథమంగా ఉంటూ ఉద్యోగాలు సాధిస్తున్నారని ఆయన అన్నారు. కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణతో పాటు జీవన నైపుణ్యాలు, నైతికత, ముర్తిమత్వ వికాసం, తదితర అంశాల పట్ల ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. గిరిజన బీఈడీ కళాశాల పూర్తిస్థాయి వనరులతో అత్యుత్తమంగా నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఇతర అధికారుల సహాయ, సహకారాలు సూచనలతో మంచి ఫలితాలతో నిర్వహించబడుతుందని, ఇకముందు కూడా గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు మరింత సమిష్టి కృషితో ప్రిన్సిపాల్, అధ్యాపకులు పనిచేయాలని తెలుపుతూ ఈ సందర్భంగా వారికి, విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.