నేటి గద్ధర్ న్యూస్, అల్లూరి జిల్లా, పాడేరు:
జాతీయ స్థాయి పరుగు పోటీలలో బంగారు బహుమతులు గెలుచుకున్న ఇద్దరు క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అభినందించారు. ఇటీవల మే 25 నుండి 28 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లో ఖేలోభారత్ యూత్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరుగు పందాలు పోటీలలో పాడేరు నుండి కొర్రా గోపి, కిల్లోబుద్దు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందినట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎ. జగన్మోహన్ పేర్కొన్నారు. కొర్రా గోపి 5 కిలో మీటర్లు పరుగు పందెంలో మొదటి స్థానం సాధించి బంగారు పతాకాన్ని, కిల్లోబుద్దు 10 కిలోమీటర్లు పరుగు పందెంలో మొదటి స్థానం సాధించి బంగారు పతాకాన్ని కైవసం చేసుకున్నారని ఆయన వివరించారు. ఈ నేపధ్యంలో గెలుపొందిన క్రీడాకారులు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను సోమవారం తన చాంబర్ లో కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీదాదికారి ఎ. జగన్మోహన్ రావు పాల్గొన్నారు.