+91 95819 05907

ఉపాధి పనిలో జరిగిన అవకతవకలపై ప్రజావాణి లో ఫిర్యాదు:CPIML మాస్ లైన్ (ప్రజా పంథా)

★CPIML మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ ఆద్వర్యంలో ఉపాధి పనిలో జరిగిన అవకతవకలపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి అధికారులను కలిసిన గొంపల్లి గ్రామ ప్రజలు.

★తప్పుడు పద్దులు వేసి ఉపాథి కార్మికుల కష్టాన్ని కొల్లగొట్టాలని చూసిన సంబంధిత అధికారులను వారం రోజుల్లో సస్పెండ్ చేస్తామని కార్మికుల సొమ్మును రికవరీ చేసి కార్మికుల భ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రజావాణి అధికారులు.

★తప్పు చేసిన అధికారులను చర్ల MPDO వెనకేసుకొనీ రావడం సరైనది కాదు.

★ఉపాధి హామీ పనిలో తప్పుడు పద్దులు వేసిన అధికారులను సస్పెండ్ చేసేదాకా కష్టపడిన కార్మికులకు న్యాయం జారిగేదాకా పోరాటం కొనసాగిస్తాం.

★CPIML మాస్ లైన్ (ప్రజా పంథా) పార్టీ చర్ల మండల కమిటి

నేటి గద్ధర్ న్యూస్ వెబ్ డెస్క్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి అధికారులను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ ఆధ్వర్యంలో గొంపల్లి గ్రామ ప్రజలు కలిసి ఉపాధి హామీ పనిలో జరిగిన అవకతవకలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ చర్ల మండలంలోని గొంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని పనిచేసిన వారికి కాకుండా పనిచేయని వారికి కూడా పద్దులు వేశారని బిల్లులు చేశారని వివరించారు సుమారుగా మూడు లక్షల వరకు తప్పుడు పద్దులు వేసి డబ్బులు కాజేశారని వివరించారు ఉపాధి హామీ అధికారులు సొమ్ము ఒకరిది సోకు ఒకరిదిగా వ్యవహరిస్తున్నారని అన్నారు పని ప్రదేశంలో కార్మికుల ముందు హాజరు వేయడం లేదని పని ప్రదేశంలో తెల్ల కాగితంపై పనికి వచ్చిన ఉపాధి కార్మికులతో సంతకాలు పెట్టించుకుని అధికారులు వారి ఇంటివద్ద వారికి నచ్చిన వారికి పనికి రాని వారికి కూడా మస్టర్ కాగితంపై హాజరు వేస్తున్నారని అన్నాను లక్షలలో అవకతవకలు జరిగాయని అన్నారు ఇది జరిగి ఇప్పటికీ 15 రోజులు గడుస్తున్న తప్పు చేసిన అధికారులపై చర్ల లోని స్థానిక అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని అన్నారు కరువు పని కోసం వెళ్లిన ఉపాధి కార్మికుల కష్టాన్ని దోచుకోవాలని చూడడం అట్లాంటి అధికారుల పట్ల పై అధికారులు మెతక వైఖరి వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అని అన్నారు . ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని తప్పుడు పద్దులు వేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని పనిచేయని వారికి ఖాతాలో పడ్డ డబ్బుని రికవరీ చేసి పని చేసిన కార్మికుల బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలని తద్వారా ఉపాధి హామీ కార్మికులకు న్యాయం చేయాలని మళ్ళి ఎప్పుడూ ఇట్లాంటి అవకతవకలు జరగకుండా పునరావృతంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు

★స్పందించిన ప్రజావాణి అధికారులు★

తప్పుడు పద్దులు వేసిన అధికారుల అందరినీ వారం రోజుల్లో సస్పెండ్ చేస్తామని కార్మికుల కష్టాన్ని వృధా పోనీయమని అవకతవకలు జరిగిన సొమ్ముని రికవరీ చేసి ఉపాధి పని చేసిన కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. ఉపాధి కార్మికులు ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ చర్ల మండల నాయకులు చన్నాం మోహన్,గొంపల్లి గ్రామస్తులు పున్నారావ్,వెంకటరమణ, బాబురావు, నరసింహ మూర్తి, నగేష్, సీత, మంగవేణి, నాగమణి, శోభారాణి, సూరమ్మ,పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !