నేటి గదర్ న్యూస్ , ఖమ్మం ప్రతినిధి :
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియం విద్యను కొనసాగించాలని టీఎస్ యుటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ.వీ. నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు ప్రభుత్వన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం, 9, 10వ తరగతులకు రెండు మీడియంలో బోధించాలని వారి తెలిపారు.కానీ ఇంగ్లిష్ మీడియం మాత్రమే కొనసాగించాలని కలెక్టర్ చెప్పినట్లు డీఈఓ సూచిస్తున్నారని, దీని వలన తెలుగు భాష పై విద్యార్థులు పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
Post Views: 49