★ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ యాక్షన్…
★బస్సు లేక అవస్థలు పడుతున్న ప్రజలు…
★ప్రయాణికులకు సరిపడా లేని ఆర్టీసీ బస్సులు…
★ఓక్కో బస్సులో 120 మందికి పైగా ప్రయాణం…
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు✍️
బస్సు ఆపడానికి వెళ్లిన ఓ ప్రయాణికుడిపై షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో పని చేసే డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు.చాలా సేపటి నుండి బస్సు కోసం విసిగి వేసారిన జనాలు ఒక్కసారిగా బస్సు రావడంతో బస్సు దగ్గరికి వెళ్లారు.సమయపాలన అడిగి బస్సు ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్ ను అడగడంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ ప్రయాణికుడుపై దాడికి పాల్పడ్డాడు.ఇప్పటికే ప్రయాణికులకు సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ఒక్కో బస్సులో 55 మంది ప్రయాణికులు ప్రయాణం చేయాల్సి ఉండగా 120 మంది వరకు ప్రయాణికులు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.ఆర్టీసీ బస్సులు సరిపడ లేకపోవడం ఒకటైతే సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు.ఇక రాత్రి 8గంటల 30 నిమిషాల నుండి అర్ధరాత్రి అయినా షాద్ నగర్ కు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ప్రయాణాన్ని కొనసాగించకపోవడంతో అటు బైపాస్ లో పోయే బస్సులు కూడా బైపాస్ లో ఆపకపోవడంతో అసలు షాద్ నగర్ ప్రజలు చేసుకున్న పాపమేంటని మండిపడుతున్నారు.షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలు దీనిపై ఆర్టీసీ డిపో మేనేజర్ ను వివరణ కోరగా దాడి జరిగింది. వాస్తవమేనని ఆ డ్రైవర్ ను పిలిపించి మాట్లాడుతానని చెప్పడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.ఇక డిపోలో సరిపడా బస్సులు లేవని ఇప్పటికే పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ చెప్పుకొచ్చారు.