+91 95819 05907

లయన్స్ క్లబ్ సామాజిక సేవలు ప్రశంసనీయం:Mla

★పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 10:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరులోని స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు అధ్యక్షతన లైన్స్ క్లబ్ 30వ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. లయన్స్ క్లబ్ మణుగూరు 30వ ప్రెసిడెంట్ గా నల్లగట్ల సత్య ప్రకాష్,సెక్రటరీ షేక్ మీరా హుస్సేన్,ట్రెజరర్ ఎం శ్రీనివాసరావులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ,లయన్స్ క్లబ్ మణుగూరు ఆపదలో ఉన్నవారికి చేస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని అన్నారు. పర్యావరణం,విద్య, వైద్యంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని అన్నారు.నూతన ప్రెసిడెంట్ సత్య ప్రకాష్ నాయకత్వంలో ఈ సంవత్సరం కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరి అభిమానాన్ని పొందాలన్నారు. లయన్స్ క్లబ్ కు ఆర్థిక,హార్దిక సహాయ సహకారాలు అందిస్తున్న చార్టర్ ప్రెసిడెంట్ పిల్లారి శెట్టి హరిబాబును అభినందించారు.ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ సిహెచ్ వి శివప్రసాద్ మాట్లాడుతూ, మణుగూరు లయన్స్ క్లబ్ 460 సామాజిక సేవ చైతన్య కార్యక్రమాలు చేసి ఫస్ట్ బెస్ట్ ప్రెసిడెంట్,ఫస్ట్ బెస్ట్ సెక్రెటరీ, తాడ్ బెస్ట్ ట్రెజరర్ గా జోన్ మరియు రీజియన్ స్థాయిలలో అవార్డులు అందుకున్నారని, జిల్లాలో కూడా మూడవ స్థానంలో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు.జీవితంలో నిజమైన ఆత్మసంతృప్తి సేవ ద్వారా మాత్రమే లభిస్తుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు,ఎలెక్ట్ ప్రెసిడెంట్,నల్లగట్ల సత్య ప్రకాష్, సెక్రటరీ షేక్ మీరా హుస్సేన్, ట్రెజరర్ ఆడబల నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు,ప్రోగ్రాం చైర్ పర్సన్ పిల్లారిశెట్టి హరిబాబు,కో చైర్ పర్సన్ ఎం నాగేశ్వరరావు, ఆర్ సి గబ్బేట రాజయ్య,జెడ్ సి.వి. కృష్ణమోహన్,జెడ్ సి డెసిగ్నేట్ భూక్య ప్రసాద్,ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ కాప మురళి కృష్ణ,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య,క్లబ్ సభ్యులు డాక్టర్ గాజుల కోటేశ్వరరావు,గూడవల్లి లక్ష్మణరావు,గాజుల రమేష్, దండ రాధాకృష్ణ,దుగ్గి సతీష్ కుమార్,కముజు చంద్రమోహన్, బేతంచర్ల వెంకటేశ్వర్లు,డాక్టర్ సమ్మయ్య,చింతపల్లి రాంబాబు, భాగం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !