నేటి గదర్ న్యూస్ : మధిర ప్రతినిధి : మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 128 కోట్లు కేటాయించటం చారిత్రాత్మకం అని 12, 11వ వార్డు ఎస్సీ కాలనీ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మధిర మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ నిర్మించడం కోసం మధుర నియోజకవర్గ ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 128 కోట్లు మంజూరు చేయటం చారిత్రాత్మక మైన విషయంగా ఉంది. అనేక సభల్లో మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నా ప్రాణం అంటూ సందర్భం వచ్చినప్పు డల్ల చెబుతూ ఉన్నారు. దానికి తగ్గట్టే మధిర మున్సిపాలిటీకి 128 కోట్లు అండర్ డ్రైనేజ్ కి కేటాయించడమే కాక కాంగ్రెస్ గవర్నమెంట్ కొలువుదీరిన 60 రోజుల్లో మధిర నియోజకవర్గానికి 370 కోట్లు నిధులు కేటాయించి తనకు మధిర మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు. మధిర ఎస్సీ కాలనీలో గల 12వ, 11వ, వార్డులలో గల ఎస్సీ కాలనీ కాంగ్రెస్ నాయకులు కటుకూరి శ్యామా రావు, గట్టిగుండ రవి, గద్దల కిరణ్, రేపంగి ఏసు, దుబాసి ఏసు, గద్దల వెంకటేశ్వర్లు, వర్షం వ్యక్తం చేశారు మధిర పట్టణంలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మల్లు భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలిపినారు.
