+91 95819 05907

ఆదివాసి గిరిజన గ్రామాల కు మౌలిక సౌకర్యాలు కల్పించాలని

★ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేత…

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 11:

పినపాక నియోజకవర్గం పరిధిలోని గిరిజన ఆదివాసి గ్రామాల మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు)ఆధ్వర్యంలో మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి నాసర్ పాషా మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గ పరిధిలోని మణుగూరు,అశ్వాపురం, పినపాక మండలాల్లోని ఆదివాసి గిరిజన గ్రామాలైన బుగ్గ,ఖమ్మం తోగు,బుడుగుల, రేగుల గండి,రాయన్నపేట,సర్వాయి గుంపు, పెద్దిపల్లి,విప్పల గుంపు,కుమ్మరి గుంపు, మనుబోతుల గూడెం,మామిళ్ళవాయి, గుండ్ల సాగర్,బండ్ల గుంపు,వెంకటాపురం, పిట్టతోగు,రేగళ్ల,సుందరయ్యనగర్,ఉమేష్ చంద్రనగర్,ఎస్టి కాలనీ గుంపు,వేగులూరు, సీతానగర్ తదితర ఆదివాసి గిరిజన గ్రామాలలో రహదారి సౌకర్యం,విద్యుత్ సౌకర్యం,త్రాగునీటి సౌకర్యం లేక ఆదివాసీలు ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రహదారి లేక ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని,కొన్ని గ్రామాలలో ప్రాథమిక పాఠశాలలు కూడా లేవని అన్నారు.ఏనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆదివాసీలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు.ఎన్నికల కోడ్ కూడా ముగిసింది కనుక పైన తెలిపిన ఆదివాసి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు.అదే విధంగా వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆదివాసి గూడేలలో ముందస్తు ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రభుత్వం ఉచిత దోమ తెరల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని, మణుగూరు ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి ఏర్పాట్లు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్ పలువురు ఆదివాసీలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

 Don't Miss this News !