..
సర్క్యులర్ విడుదలపై ఐ ఎన్ టి యు సి నాయకుల హర్షం…
చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన:INTUC,SCML నాయకులు.
నేటి గద్దర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 11:
నైనారపు నాగేశ్వరరావు ✍️
సింగరేణి వారసత్వ ఉద్యోగుల నియామక వయో పరిమితి 35 నుండి 40 ఏళ్లకు పెంపు సర్క్యులర్ ఆదేశాలు విడుదలపై సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి)మణుగూరు ఏరియా బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి సిల్వేరు గట్టయ్య యాదవ్ లు హర్షం వ్యక్తం చేశారు.పీవీ కాలనీ ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో మంగళ వారం నాడు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క,సింగరేణి సిఎండి బలరాం నాయక్ (ఐఆర్ఎస్) మరియు ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి జనక్ ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.సింగరేణి కార్మిక గుర్తింపు ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలిపారు.ఈ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరినట్లుగా వారు అభివర్ణించారు.35 ఏళ్లకు వయసు పైబడి ఉద్యోగాలు రావని నిరాశ,నిస్పృహలతో ఉన్న డిపెండెంట్ లకు 40 ఏళ్లకు వయోపరిమితి పెంపు సర్క్యులర్ ఎంతగానో లబ్ధిచేకూరనుందని అభిప్రాయపడ్డారు.ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాద్ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన 441 మంది సింగరేణి నూతన ఉద్యోగుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సందర్భంగా తమ నాయకులు బి జనక్ ప్రసాద్ వయోపరిమితి అంశాన్ని లిఖిత పూర్వకంగా దరఖాస్తు రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగిందన్నారు.అనంతరం స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ మంత్రి బట్టి విక్రమార్క చర్చించి అదే వేదికపై సింగరేణి ఉద్యోగులపై ఉన్న ప్రత్యేక అభిమానంతో మా ప్రభుత్వం వయోపరిమితి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తుందని సభికుల హర్షద్వారాల మధ్య ప్రకటించడంతో పాటు దీనిపై సర్క్యులర్ విడుదల చేయాలని అక్కడికక్కడే సింగరేణి సిఎండి ఎం బలరాం కూడా ఆదేశాలు జారీ చేశారు.ఆ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు,ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని కోడ్ ఎత్తి వేసిన వెంటనే సర్క్యులర్ జారీ అయిందని ఆయన తెలిపారు.వీలైనంత త్వరగా కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని ఎలాంటి షరతులు లేకుండా,కొర్రి పెట్టకుండా వయోపరిమితి పెంపు సర్క్యులర్ అమలు చేయాలని ఆయన సింగరేణి అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు వత్సవాయి కృష్ణంరాజు ,
సిల్వేరు గట్టయ్య యాదవ్,సూరపాక రాములు,షేక్ మస్తాన్,మిద్దెపాక శ్రీనివాస్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.