★అల్లూరి జిల్లాలో మృతదేహం కలకలం
★వారం రోజుల తర్వాత మృతదేహం లభ్యం
నేటి గద్ధర్ న్యూస్,అల్లూరి సీతారామరాజు జిల్లా:
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలో డోకులూరు పంచాయతీకి చెందిన వల్లాపురం గ్రామానివాసి టిడిపి కార్యకర్త పాంగి అప్పలకొండ బాబు(29) తండ్రి పేరు రామారావు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గత 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అప్పలకొండ బాబును తీసుకువెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు.మరుసటి రోజు నుండి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గ్రామాలకు బంధువులకు సమాచారం తెలుసుకుని ఎక్కడ ఆచూకీ కనబడకపోవడంతో భయందోలనకు గురై స్థానిక పాడేరు పోలీస్ స్టేషన్ వారికి 7వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.కంప్లైంట్ ఇచ్చి రెండు రోజుల తర్వాత గ్రామస్తులకు మృతదేహం కలకలం.వల్లపురం గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు.అసలు ఏం జరుగుతుందో దిక్కుతోచని పరిస్థితి లో గ్రామస్తులు ఉన్నారు.ఎవరో హత్య చేసి పడేసినట్లు అనుమానం గా ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.వెంటనే ఈ హత్యకు గల నేరస్తులను శిక్షించాలని,మాకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.