నేటి గదర్ ,జూన్ 12 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి)
కూసుమంచి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాలు ,యూనిఫాంను కూసుమంచి మండల ఎంపిపి బానోత్ శ్రీనివాస్ నాయక్ విద్యార్దులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ పెద విద్యార్దులకు మంచి విద్యను అందిస్తుంది ..విద్యార్దులు మంచిగా చదువు తల్లిదండ్రులకు ,పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అజిత కుమారి, సాలన్ భాయ్, నాగమణి , రాజకుమారి ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.
Post Views: 364









