+91 95819 05907

అమ్మ ఆదర్శ పాఠశాలల నూతన సౌకర్యాలు ప్రారంభించిన MLA పాయం వెంకటేశ్వర్లు

నేటి గద్దర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 12:
నైనారపు నాగేశ్వరరావు ✍️

మణుగూరు మండల పరిధిలోని కూనవరం ప్రాధమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ అధ్యక్షతన బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను సుందరంగా అలంకరించారు.మామిడి తోరణాలు కట్టి రబ్బర్ బెలూన్స్ తో పాఠశాలలో ఆహ్లాధాకరంగా అలంకరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పినపాక శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరై తొలుత అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యుద్దీకరణ,తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ప్రారంభించారు.అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసే ఉచిత టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ మరియు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఈ వేసవిలో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన త్రాగునీరు,విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ,మైనర్ రిపేర్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసిందని,ప్రైవేటు పాఠశాలలకు దీటుగా,ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్యను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.బడి బాటలో ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం లో ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు ఇప్పటి వరకు 18 మంది విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని,ఉపాధ్యాయులను అభినందించారు.ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇంకా పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అన్నారు.తొలి అడ్మిషన్ లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించారు.అనంతరం తల్లిదండ్రుల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ,విద్యార్థుల్ని ప్రతి రోజు బడికి పంపించాలని,ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యార్థుల్ని చేర్పించాలని కోరారు. తల్లిదండ్రులకు విద్యార్థుల సంరక్షణపై కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఏనిక ప్రమీల,కూనవరం గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ, వీరస్వామి,ఎంపీడీవో శ్రీనివాస రావు,ఎంపిఓ పల్నాటి వెంకటేశ్వర్లు,అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అహ్మదుల్లా,స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం జి నాగశ్రీ,మండల నోడల్ ఆఫీసర్ స్వర్ణ జ్యోతి,ఎంపీటీసీల జిల్లా ఫోరం కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, కూనవరం ఎంపీటీసీ తాటి సరిత,విలేజ్ సెక్రటరీ సంధ్యారాణి,ఏఈ శుక్రు,యూనిఫాం స్టిచ్చింగ్ టైలర్స్,పుర ప్రముఖులు, గ్రామస్తులు,తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ టీచర్స్,సారయ్య,రఘు మోహన్ రావు,సింగ రవిబాబు, జయలక్ష్మి,బి ఈరు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !