అశ్వాపురం మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు :ఎస్కె బషీర్.
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అశ్వాపురం జూన్ 17:
నైనారపు నాగేశ్వరరావు ✍️
ముస్లిం సోదరీ,సోదరమణులకు పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా అశ్వాపురం మండల ముస్లిం మైనార్టీ అధ్యక్షులు :ఎస్కె బషీర్ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మానవుల్లో త్యాగ గుణాన్ని పెంచటమే బక్రీద్ పండుగ ఉద్దేశమని అన్నారు. స్వార్థం,రాగద్వేషాలను వదిలిపెట్టి త్యాగ గుణం పెంచుకోవాలని,త్యాగ గుణాన్ని ప్రభోదించే బక్రీద్ పండుగను స్ఫూర్తిగా తీసుకుందామని అన్నారు.సమైక్యతా,
మానవత్వం దిశగా అడుగులు ముందుకు వేద్దామని,త్యాగానికి, సత్యానికి ప్రతీక బక్రీద్ పర్వదినం మహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను సహోదర భావాన్ని అందరూ అనుసరించాలని అల్లా అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.