డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా…
పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో…
మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ…
నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు నవంబర్ 22:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన లో భాగంగా పే బ్యాక్ టు యువర్ సొసైటీ కార్యక్రమంలో భాగంగా మాదిగ జాతిలోని సురక్ష బస్టాండు ప్రాంతంలో చేతి వృత్తి పని చేస్తున్న పేద కుటుంబమైన నాగేశ్వరరావుకు మణుగూరు ఆర్టీసీ డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగపురి ప్రతాప్ మరియు అతని స్నేహితులు సింగరేణి ఎంప్లాయీస్ గొడ్ల విజయ్ కుమార్,జెల్లీ తిరుపతి,మునిగేల హరికృష్ణ,సెల్ఫ్ ఎంప్లాయ్ కుంపటి శ్రీనివాస్ (పాల్వంచ) మరియు పినపాక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విజయ్ కుమారి(పండిత) గారి సహకారంతో 2300/- రూపాయలను మణుగూరులో చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆలోచన విధానాల్ని ఆశయాలను నెరవేర్చాలంటే ఈ సొసైటీలో వెనుకబడిన నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాజ్యాంగ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆలోచన విధానం పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు అమలు చేసినప్పుడే ఆయన ఆశయాలను నెరవేర్చినట్లుగా అవుతుందని వారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉందని వారన్నారు. ఎంతోమంది నిరుపేదలు వారి పిల్లలను చదివించుకోలేక ఆర్థికంగా అనేక అవస్థలు పడుతున్నారని,అలాంటి పేద విద్యార్థులను చదివించేందుకు ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని వారన్నారు.