★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ?
★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో
★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి
★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ లలో ఉపాధి కల్పించాలి
★మంత్రి పొంగులేటి కి మరియు ఎంపీ బలరాం నాయక్ కు వినతి.
★ఐఎఫ్టీయు అనుబంధ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నాసర్ పాషా.
నేటి గధర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు నవంబర్ 22:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గంలోని మణుగూరు సింగరేణి ఏరియాలో కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే అవుతుందని మణుగూరు ప్రాంతంలో కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలని
ఐఎఫ్టియు అధ్యర్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మహబూబా బాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్ కి వినతి పత్రాలు అందజేయడం జరిగింది.
మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు ఉన్న గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహకారంతో ఐఎఫ్టియు అధ్యర్యంలో రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మహబూబా బాద్ ఎంపీ పొరిక బలరాం నాయక్ కి శుక్రవారం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేసినట్లు ఐఎఫ్టీయు అనుబంధ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నాసర్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతున్న ఓసి గనులు మూత పడనున్నాయని,కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మణుగూరులో కొత్త గనుల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని,ఉన్న గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలని, అన్ని గనులు సింగరేణి ఆధ్వర్యంలోనే నడిపించాలని ప్రజా ప్రతినిధులను కోరినట్లు ఆయన తెలిపారు.దీంతో పాటు
మణుగూరుకు వరద ముంపు నివారిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని,ఇటీవల భారీ వర్షాలకు వరద ముంపునకు గురై సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు ఇందిరమ్మ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,సింగరేణి భూ నిర్వాసితులకు,ప్రభావిత గ్రామాల యువతకు,సింగరేణి డిపెండెంట్ లకు,స్థానికులకు సింగరేణి ఓబి కంపెనీలలో, సెక్యూరిటీ మరియు ఇతర సివిల్ కాంట్రాక్ట్ పనులలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.మణుగూరులో ట్రాఫిక్ నివారణకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలని పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు మణుగూరులో ఐదు సెంట్ల భూమిలో గృహ నిర్మాణం చేపట్టి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో గుడిపూడి కోటేశ్వరరావు,ఎస్ డి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.