రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాశ్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు.కాళ్ళకల్ గ్రామంలో శ్రీరామ్ పాండరీ అనే వ్యక్తి ఒక గృహం నిర్మించే క్రమంలో ప్రమోద్ పాశ్వాన్ గుత్తదారుకు ఇవ్వడం జరిగింది.ప్రమోద్ పాశ్వాన్ బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకున్న క్రమంలో చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాశ్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండడం అదే ఇంటిలో ఉండడంతో కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాశ్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని బిట్టు కుమార్ బీహార్ కు సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో కొట్టి తో హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో తేలడంతో బిట్టు కుమార్ అనే వ్యక్తి ని పట్టుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తూప్రాన్ సిఐ.రంగా మీడియా ప్రకటనలో తెలిపారు.కేసును ఛేదించిన మనోరబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, శ్రీనివాస్ రాథోడ్, కృష్ణ కానిస్టేబుళ్లను అభినందించారు.