*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి*
*తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్*
*ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*
నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22:
మూడు నాలుగు నెలల నుంచి ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు రావడంలేదని మరియు ఏటూరు నాగారం మండలంలోని కొండాయి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు మద్యం సేవించి వస్తున్నారని విచారణ జరిపించాలని తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం (టిఏవీఎస్) భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో డిడి పోచం గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. *ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం (టిఏవిఎస్) జిల్లా నాయకులు సోడి అశోక్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజలు మాట్లాడుతూ* వెంకటాపురం (నూగుర్) మండలంలోని ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో గత రెండు మూడు నెలల నుంచి ఉపాధ్యాయులు రాక విద్యార్థులకు కనీస బోధన లేక విద్యార్థులు చెరువులు కుంటలో ఆడుకునే పరిస్థితి ఉంది అన్నారు విద్యార్థులకు ఏమన్నా జరిగితే బాధ్యత ఎవరు అన్నారు విద్యార్థులు చదువుకునే వయసులో ఉపాధ్యాయులు లేకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటని అన్నారు వెంటనే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా ఏటూరు నాగారం మండలంలో కొండాయి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు మద్యం సేవించి విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని అన్నారు కొండాయి ఆశ్రమ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని వారు అన్నారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని ఎడల తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్జ్, ఎస్ఎఫ్ఐ బొగ్గుల రామ్ చరణ్, స్వామి, సాయి తదితరులు పాల్గొన్నారు