రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ. సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ కోమటిపల్లి గ్రామ శివారులో ఉన్న కస్తూర్బాగాంధీ హాస్టల్ మరియు మోడల్ స్కూల్ ఉండడం వలన రామాయంపేట మండల పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల ద్విచక్ర వాహనాల పైన స్టిరింగ్ ఆటోలలొ వస్తున్నారని ఆమలుపు వద్దకు రావడంతో విద్యార్థులు భయపడి జంకుతున్నారని అక్కడే ప్రమాదాలు బాగా జరుగుతున్నాయని అది ప్రమాదాల బ్లాక్ జోన్ గా మారుతుందని అలాగే శ్రీ ఆద్య గ్రాండ్ హోటల్ సమీపంలోని రామాయంపేట రహదారి కార్నల్ వద్ద అనేక ప్రమాదాలు జరుగుతున్న విషయం పాఠకులకు తెలిసిన విషయం విధితమే.ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నారు.