108 పైలట్ సాయి కుమార్ కుటుంబానికి రూ 5 లక్షల భీమా చెక్కు అందజేత.
నేటి గద్ధర్ న్యూస్,పినపాక:
– ఈ ఎం ఆర్ ఐ సంస్థ అందించిన భీమా సొమ్ము చెక్కును అందించిన జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి భూమా నాగేందర్.
పినపాక మండల పరిధిలోని ఉప్పాక గ్రామానికి చెందిన 108 పైలట్ కాలేవారు సాయి కుమార్ గత ఏడాది మృతి చెందాడు. కాగా 108 సేవల భాగస్వామి అయిన ఈ ఎం ఆర్ ఐ సంస్థ పైలట్ సాయి కుమార్ కు చెందిన భీమా సొమ్ము రూ,5 లక్షల చెక్కును, సోమవారం మృతుడు సాయి కుమార్ తల్లిదండ్రులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి భూమా నాగేందర్ అందజేశారు. కార్యక్రమం లో ఈ ఎం ఈ దుర్గా ప్రసాద్, పినపాక 108 సిబ్బంది అప్పిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 463