ఉద్యమాల పురిటి గడ్డపై వీరనారి పాయం రాములమ్మ మృతి…
భర్త అడుగుజాడల్లో కీలక పాత్ర పోషించిన రాములమ్మ…
వేలాది మందితో అంతిమయాత్ర కొనసాగింది…
పలువురు మంత్రులు చరవాణిలో పాయం వెంకటేశ్వర్లు కు ప్రగాఢ సానుభూతి తెలిపారు…
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు జూన్ 17:
నైనారపు నాగేశ్వరరావు ✍️
మణుగూరు సిపిఐ మహిళా ఉద్యమానికి 1980 దశకములో పాయం రాములమ్మ వీరనారిగా నిలుస్తూ,ఉద్యమాల పురిటి గడ్డపై పాయం రాములమ్మగా పేరు భావించబడ్డారు.ఆమె మృతి ఎంతో మంది పేద ప్రజలకు తీరం లోటుగా ఉందని పలువురు కొనియాడారు.తన భర్త స్వర్గీయ కాయం కామరాజు CPI పార్టీ అనుబంధ సంఘం AITUC విభాగాలలో ముఖ్య నేతగా నిలిచారు.మణుగూరు తొలి ఓపెన్ క్యాస్ట్ ఓసి వన్ కేబుల్ మెయిన్ గా విధులు నిర్వహిస్తూనే మణుగూరు అభివృద్ధిలో భార్యాభర్తలిద్దరూ కీలక పాత్ర పోషించారు. రాములమ్మ భర్త కామరాజు అడుగుజాడల్లో తన కుటుంబ బంధువులందరినీ తన కుమారులలో ఒకరైన ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విద్యార్థి ఉద్యమాల వైపు పరుగులు పెట్టించారు.నీతిగా నిజాయితీగా అట్టడుగు బలహీన వర్గాలకు చేయూతగా పాయం వెంకటేశ్వర్లు తీర్చిదిద్దడంలో తల్లిగా,గురువుగా పేదల కష్టసుఖాలను వివరించేవారు. తల్లి ప్రోత్సాహం వల్లనే విద్యార్థి నాయకుడి నుండి రాజకీయ నేతగా ఎదగడంలో తల్లిపాత్రగా రాములమ్మ నిలిచారు.వారి అకాల మరణానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు,మేధావులు,కార్మిక సంఘాల నాయకులు,సామాజిక సంఘాల నాయకులు, అధికారులు,మణుగూరు పుర ప్రముఖులు,పట్టణ ప్రజానీకం దిగ్భ్రాంతికి గురయ్యారు. తనయుణ్ణి ఎమ్మెల్యేగా చూడటంలో ఆమె కలలు నిజమైనాయి.పాయం రాములమ్మ అకాల మరణానికి చింతిస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.రాములమ్మ పార్థివ దేహానికి పలువురు నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య వారి అనుచరుగనంతో రాములమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం MLA పాయం వెంకటేశ్వర్లు కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పలువురు మంత్రులు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,బట్టి విక్రమార్క,సీతక్క మరియు ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
చరవాణి ద్వారా వెంకటేశ్వర్లు తల్లి రాములమ్మ మృతికి పలువురు సంతాపాన్ని తెలియజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వేలాది మందితో పాయం రాములమ్మ అంతిమయాత్ర కొనసాగింది.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు,వేలాదిగా తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.