★వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దు మృతి చెందడంతో రైతు కంట కన్నీరు
★సుమారు రు.80 వేల విలువ చేసే ఎద్దు మృతి
★మరో ఎద్దు కొనలేని పరిస్థితిలో పేద రైతు.
★ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకొలు.
నేటి గదర్ ,జూన్ 24 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం ఎనేకుంటాతండలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎనేకుంటతండ గ్రామానికి చెందిన రైతు భానోత్ లీలా కు రెండు దుక్కెట ఏద్దులు ఉన్నాయి .. మేతకోసం వెళ్లిన ఎద్దు తెగిన విద్యుత్ తీగ తగిలి అక్కడిక్కడే మృత్యువాత పడింది. సుమారు 80 వేలు ఖరీదు చేసే ఎద్దు చనిపోవడంతో రైతు లీలా కన్నీరుమున్నీరు అయ్యారు. ఎద్దు చనిపోవడానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని రైతు ఆరోపించారు. రెండు రోజుల క్రితమే తమ పొలంలోని విద్యుత్ తీగలు కిందకు వ్రేలడుతున్నాయి అని అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోలేదనీ , అధికారులు స్పందించి ఉంటే తమ ఎద్దు చనిపోయేది కాదని వాపోయారు.. కరెంట్ తీగ తెగడంతోనే ప్రమాదం జరిగినట్టు స్పష్టం అయినా విద్యుత్ అధికారులు తమ తప్పేమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలుకే పెద రైతు వ్యవసాయ పనులు మొదలుపెట్టే సమయంలో ఇలా దుక్కటేద్దు చనిపోవడంతో ,మరల వ్యవసాయానికి ఎడ్లను కొనుక్కోలేక పరిస్థితిలో రైతు ఉన్నారు . ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నారు.