+91 95819 05907

నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

★జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత.

★తెలంగాణ నేతకాని సంఘం జేఏసీ నాయకులు జాడి ఈశ్వర్ నేతకాని.

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్,జూన్ 24:

నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ ప్రాంతం లో నివసిస్తున్న నేతకాని కులస్తులకు గిరిజనులతో సమాన హక్కులు కల్పించాలని కోరుతూ తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల సంఘం ప్రజా జేఏసీ నాయకులు జాడి ఈశ్వర్ నేతకాని ములుగు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 20 లక్షలకు పై చిలుకు ఉన్న మా కులస్తులను రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా కులస్తులు అభివృద్ధికి నోచుకోవడం లేదని, దరిద్ర రేఖకు దిగువన ఉన్నారని, ఇన్ని సంవత్సరాల స్వాతంత్య్ర భారతం లో ప్రభుత్వ సంక్షేమాలు మాకు అందని ద్రాక్షలా మరాయాని, అందుకే మా కులానికి ప్రత్యేక నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో రాజుల పరిపాలన, బ్రిటిష్ పరిపాలన కంటే ముందు నుండి ఇదే ప్రాంతం లో పుట్టి, పెరిగి , ఇదే మట్టిలో కాలం చేస్తున్నామని, కానీ ఇప్పుడున్న ఏజెన్సీ చట్టాల వలన మా కులస్తులకు చదువుకున్న, ఉద్యోగ అవకాశాలు తక్కువ, వ్యవసాయం చేద్దామంటే భూమి లేదు, ఉన్న గింతంత భూమికి దిక్కు లేదు, హక్కు పత్రాలు లేవని, ప్రభుత్వం మా కులస్తులను నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం లో మా కులస్తులను బ్రిటిష్ వాళ్ళు కొండ గిరిజనులను గుర్తించారని, భారత రాజ్యాంగ లో అది పొందుపరచక పోవడం వలన, ఏజెన్సీ చట్టాలు మాకు వర్తించక , ఈ ప్రాంతం లో చస్తూ బ్రతుకుతున్నామని , ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న మా కులస్తులకు గిరిజనులతో సమాన హక్కులు కల్పించేలా జీవో విడుదల చేసి, అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు , మా నేతకాని కులానికి సరైన న్యాయం చేయని పక్షంలో అసెంబ్లిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !