*23-11-2024 (చిన్న తాండ్రపాడు )*
ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన వ్యక్తి పురుషోత్తం గారు తన సొంత ఎదుగుదల గురించి ఆలోచించకుండా తాను నమ్మిన సిద్ధాంతం గురించి ఆలోచించినవాడు .ఏ వృత్తిలో ఉన్న ఆ వృత్తికి న్యాయం చేయాలనేవాడు ఉపాధ్యాయుడుగా జర్నలిస్టుగా న్యాయవాదిగా ఎన్ని చేసినా నిజాయితీగా నిబద్దతుతో నిలబడినవాడు పురుషోత్తం….
ప్రజా హక్కుల ఉక్కు పిడికిలి… పురుషోత్తం మనకు దూరమై 24 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయనను గురించి కొన్ని విషయాలు తేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌర హక్కుల సంఘం సంస్థ పై ఆనాడు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న భయపడక ధైర్యంగా సంస్థ కార్యక్రమాలను క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ప్రభుత్వం పోలీసుల కుట్రలో సర్కారీ అంతకముటాల చేతుల్లో హత్యకు గురైనాడు. రాష్ట్రంలో దళితులపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్న క్రమంలో ఆ దాడులు ఏఏ రూపాలలో జరుగుతున్నావో రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసి దళితులపై దాడులు ఆగేది ఎప్పుడు అని పుస్తక రూపంలో తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర వహించాడు.1990వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ఎన్కౌంటర్ పరంపర కొనసాగుతున్నప్పుడు ప్రజా సంఘాలతో బూటకపు ఎన్కౌంటర్ల పోరాట కమిటీని ఏర్పాటు చేసి ఎన్కౌంటర్లన్నీ రాజకీయ హత్యలేనని నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నడిపించడంలో పురుషోత్తం చురుకైన పాత్ర వహించారు. పురుషోత్తం ఏది చెప్పాడో అది ఆచరించిన వ్యక్తి తీవ్ర నిర్బంధ కాలంలో ప్రాణానికి భయపడకుండా రాజ్య హింసకు వ్యతిరేకంగా నియమ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. 23 – నవంబర్ – 2000 సంవత్సరంలో సర్కారీ అంతగా మూటల చేతిలో ది ల్ సిక్ నగర్ హైదరాబద్ లో పురుషోత్తం ఇంటికి వెళుతున్న క్రమంలో కత్తులతో దాడి చేసి నరికి చంపారు ఆ సంఘటన పౌర హక్కుల ఉద్యమానికి తీరనిలోటు గ మిగిలి పోయింది పురుషోత్తం బ్రతికి ఉన్నంతకాలం అనగారిన ప్రజల దళిత పీడిత ఆదివాసి మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి. మనం కూడా ఆ స్ఫూర్తితో పని చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాము.
2000 -నవంబరు -23 చరిత్రలో చీకటి రోజు రాజ్యం సంబరం చేసుకున్న రోజు ప్రజల హక్కులకు దిక్కు కోల్పోయిన రోజు కన్నీళ్లు ఒక చేత్తో తుడుచుకుంటూనే ప్రజలు పురుషోత్తమస్మరించుకున్న రోజు .రాజ్యం తాను చంపిన వాళ్లను స్మరించుకోవడానికి కూడా అవకాశం లేని గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది.
రాజ్యం పౌరహక్కుల కోసం పోరాడుతున్న వారిని చంపడానికి హత్యదంతాల పరంపరను మొదట్లో రాజ్యం స్వయంగా కొనసాగించిన తర్వాతి కాలంలో నయీం అంతక ముఠాకు అప్పజెప్పింది .ఈ హంతకు ముఠా పురుషోత్తం అజమాలితో పాటు అనేకమంది ప్రజాసంఘాల నాయకులను కత్తులతో నరికి చంపింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన రాజ్యాంగ బాధ్యత కలిగిన రాజ్యం తానే ఒక హంతక ముఠా మాఫియాగా మారింది. చట్టబద్ధ. అనిచివేత. సాధనాలు అన్ని ప్రయోగించిన సంతృప్తి చెందక చట్ట బాహ్య అంతక ముఠాలను సృష్టించుకుని ఉద్యమాలను నెత్తురు లో ముంచి ప్రజలను భయాందోళన పాలు చేసే కుట్ర పాలకులకు కొత్తగా ఇప్పుడే నేర్చుకున్న పద్ధతేం కాదు .తెలంగాణ ప్రజలకు ఇవి కొత్త కాదు నిజం నవాబుల రజాకార్లను ఎదిరించి నిలబడిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. హింసతో, దాడులతో ,హత్యలతో, ఉద్యమాలు ఆగిపోయే వైతే 1985లో గోపి రాజన్నను డాక్టర్ రామనాథం లక్ష్మారెడ్డి లను చంపినప్పుడే పౌర హక్కుల ఉద్యమం నిట్టనిలువునా శిలా ప్రతిమల బిగుసుకుపోవాలి , అమరుల శరీరంలో చురకత్తులు దిగినప్పుడే ఏరులై పారిన నెత్తురు ఎంతోమంది చురుకైన యువకులను ఆవహించి నెమ్మదిగా గుండెల్లో
గనుభవించింది, ఒక్క తెలుగుదేశం హాయంలోనే మూడు వేలకు పైగా నక్సలైట్లు పార్టీ కార్యకర్తలను పూటకపు ఎన్కౌంటర్లో, కాల్చి చంపినప్పుడు చిందించిన రక్తంతో చిత్తడి చిత్తడిగా ఉన్న తెలంగాణ భయానక వాతావరణం అంతట ఆవరించి ఉన్న ప్రజలు భయపడలేదు .ఉద్యమాలు ఆగిపోలేదు విస్తరించాయి. ఆ సందర్భంలోనే పురుషోత్తం 1988లో గాయాలపాలైన పౌర హక్కుల సంఘం లోకి రంగ ప్రవేశం చేశాడు. ఇది ఒక సాహసోపేతమైన ముందడుగు. ప్రకృతి చందమామ ,వాతావరణం, దేవుళ్ళు, గూడులు ,బడులు పూలు వనాలు ,పళ్ళు ప్రశాంతత అలలు, సెలయేళ్లు వేడుకలు, విజయాల మీద రచనలు చేయాల్సిన, కవులు రచయితలు తమ రచనలను ఎన్కౌంటర్లు, మిస్సింగులు లాకప్పులు, బుల్లెట్లు ఇనుప బూట్లు నిగాకళ్లు ,రక్తపుటేరుల మీద రాయడానికి తమ చేతి కలలను మళ్లించుకున్నట్లు భద్రమైన సుభద్రమైన జీవన మార్గాలెన్నో వదిలి, బ్రహ్మజెముడులా ముళ్ళకంపలతో నిండిన దారిలోకి ఇష్టపడి మల్లాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో 1861 లో జన్మించిన పురుషోత్తం ఈ పరివర్తన చెందుతారని తల్లిదండ్రులు నమ్మిన ఏ శాస్త్రాలు చెప్పలేకపోయాయి. బాల్యంలో పురుషోత్తంకు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ బాగా చదువుకుని ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉండాలనుకునేవాడు, అందుకే గద్వాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే స్నేహితులు విప్లవాల రాజకీయాలు మాట్లాడుతుంటే చాలా దూరంగా ఉండేవాడు. కానీ గద్వాలలో చలనంలో ఉన్న భౌతిక పరిస్థితులు తనని ఓ పట్టాన స్థిరంగా ఉండనివ్వలేదు .1980లో డిగ్రీలో చేరే నాటికి గద్వాల డిగ్రీ కళాశాలలో రాజకీయాలు ఊపొందుకున్నాయి డిసెంబర్- 4- 1980 ఆర్టీసీ బస్ చార్జీలు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన చేస్తుండగా పోలీసుల కాల్పుల్లో పది సంవత్సరాల బాలుడు చనిపోగా చాలామందికి బుల్లెట్ గాయాలు తగిలాయి అది చూసి చలించి పోయాడు ఉన్నచోట నిలవలేకపోయాడు. పోలీస్ స్టేషన్ తగలబెట్టడంలో భాగమయ్యాడు ,పోలీసు రికార్డుల నిప్పు పెట్టారు విద్యార్థులు విప్లవ రాజకీయాలు మాట్లాడుతుంటే తనకు తెలియకుండానే ఇష్టం పెరిగిపోయింది .డిగ్రీ రెండవ సంవత్సరంలో రాడికల్ విద్యార్థి సభ్యుడయ్యాడు అప్పుడే వనపర్తి లో జరిగిన శ్రీశ్రీ సభకు హాజరయ్యాడు అక్కడ నుండి శ్రీశ్రీ రచనలు చదవడం మొదలుపెట్టి ప్రభావితుడైనాడు సెలవుల్లో గ్రామ ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక్కడ నుండి తన జీవితం మలుపు తిరిగింది .గ్రామాలకు తరలినప్పుడు పేదల కన్నీళ్లు చూశాడు వారి బాధలు, అర్ధనాదాలు విన్నాడు. తన జీవితం వీరి కోసం అంకితం చేయాలనుకుని చదువులు వదలుకొని పూర్తికాల సామాజిక కార్యకర్త అయ్యాడు 1882- 83 శాంతినగర్ ఐజ కేంద్రంగా సెంట్రల్ ఆర్గనైజర్గా పనిచేశాడు .1883 -84 లో డాక్టర్ గా అడవులలోకి ప్రవేశించి కొల్లాపూర్ ప్రాంతంలో గంగన్న పేరుతో 1887 వరకు పనిచేసి అనారోగ్య కారణాలతో అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన పురుషోత్తం విద్యా వాలంటరీగా కొద్దిరోజులు పనిచేశాడు. 🔸ఆంధ్ర ప్రదేశ్ హక్కుల పౌర హక్కుల సంఘం…. మహబూబ్నగర్ జిల్లా కమిటీలో సభ్యునిగా చేరారు. అతికొద్ది కాలంలోనే జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎదిగాడు .ఆ తర్వాత వెనుదిరగకుండా ప్రజల్లో కలిసిపోయాడు సమాజంలోని ప్రతి సమస్యకు పౌర హక్కుల పార్శ్వం ఉంటుందనే, తలచి పౌర హక్కుల దృక్పథానికి ప్రజాపక్ష కోణాన్ని పునర్నిర్వశించి ఉద్యమాల్ని నూతన వరవడిలో కొనసాగించాడు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అత్యాకాండపై పోరాడాడు. జోగిని వ్యవస్థ రూపుమాపాలని ఉద్యమించాడు వివిధ సమస్యలపై విభిన్న ఐక్య కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేశాడు. ఎన్కౌంటర్ మృతుల శవాల స్వాధీన కమిటీ ఏర్పాటు చేయడంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ సంఘీభావ కమిటీ ఏర్పాటు చేయడంలో బూటకపు ఎన్కౌంటర్లో వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయడంలో మహిళలపై లైంగిక దాడి వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయడంలో. క్రియాశీలకంగా పాల్గొన్నారు దళితులు అట్టడుగు వర్గాల వారు న్యాయానికి గురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు అండగా నిలిచాడు .ఆధిపత్యం వర్గాల అణిచివేతకు రాజ్యం రక్షణగా ఉండడాన్ని ఎండ కట్టారు అంటరానితనానికి. బీజేపీ అనుసరిస్తున్న మతా రాజకీయాలకు వ్యతిరేకంగా,పాదయాత్రలు సైకిల్ యాత్రలో నిర్వహిస్తూ ఎన్నో గ్రామాలు తిరుగుతూ హోటలలో రెండు గ్లాసుల పద్ధతిని అడ్డుకున్నాడు, జీవితకాలం రాజహింసకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు పురుషోత్తం చేసిన పోరాట ఫలితంగా ఎన్కౌంటర్ మృతుల శవాలను ప్రభుత్వం కుటుంబీకులకు విధిగా అప్పగిస్తున్నది. శవాలను స్వయంగా పరిశీలించి చిత్రహింసలకు గురయ్యారు అనుకుంటే తిరిగి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశాలను పొందేవారు పాలమూరు లేబర్ వలసకు కారణమైన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండ కట్టారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. నిజనిర్ధారణ కమిటీలను నివేదికలను ప్రజలకు నివేదించేవాడు .అరెస్టు వార్త తేలియగానే వెంటనే ప్రకటన జారీ చేసేవాడు కోర్టులో హెబిఎస్ కార్పస్ పిటిషన్లు వేసి ఎంతోమంది ప్రజల ప్రాణాలను జీవితాలను కాపాడాడు. ఈ రకమైన తక్షణ స్పందన లేకపోతే ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అప్పనపల్లి గ్రామంలో గ్రామంలో విప్లవ రచయితల సంఘం సభ్యుడు సినాసి మోహన్ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, అప్పనపల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ రచనలు చేస్తున్న మోహన్ను 20వ తేదీన అర్ధరాత్రి ఇంటి పై దాడి చేసి అరెస్టు చేసి తీసుకొని పోయారు. మూడు రోజుల నిర్బంధించి తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు ఆ ప్రాంతంలో జరిగిన కానిస్టేబుల్ హత్యను అంగీ కరించాల్సిందిగా హింసించారు. అప్పట్లో అరెస్టు చేయడం అంటేనే ఎన్కౌంటర్ చేస్తారని అర్థం మోహన్ కూడా ఎన్కౌంటర్ పేరిట చంపే ప్రమాదం ఉందని ఆందోళన పడ్డాడు .ఎంతమంది ప్రాణాలను కాపాడరు . పురుషోత్తం మేము కాపాడుకోలేకపోయామని అపరాధ భావం వెంటాడుతూనే ఉంది, నీవు పరిచిన దారిలో నీ అడుగుజాడల్లో తప్పక నడుస్తామని రాజ్యం హింసాత్మక స్వభావాన్నిఎండగట్టడంలో నీవు ఇచ్చిన స్ఫూర్తితో పని చేయడంతో మరణ అంతర జీవితం రోజు రోజుకు పెరుగుతుంది.అని కోరుతూ …
*అమర్ హై పురుషోత్తం….*
*23-11-2024 నాడు మధ్యాహ్నం వర్ధంతి సభ చిన్న తాండ్రపాడు లో జరుగును.*
ఇట్లు…….
*CLC పౌర హక్కుల సంఘం.*
*మరియు పురుషోత్తం యువజన సంఘం. చిన్న తాండ్రపాడు ప్రజలు.*
*వివిధ ప్రజా సంఘాలు.* 💐💐💐💐🙏🏽✊🏾✊🏾✊🏾