+91 95819 05907

సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుపై సమీక్ష : సీఎం రేవంత్ రెడ్డి.

ఈ కొత్త పథకానికి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్,మధిర అసెంబ్లీ నియోజవర్గాల ఎంపిక…

నేటి గదర్ న్యూస్ ( స్టేట్ బ్యూరో) హైదరాబాద్ జూన్ 24:
నైనారపు నాగేశ్వరరావు✍️

విద్యార్థుల కోసం సరికొత్త స్కీం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్.రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.అధికారంలోకి వచ్చిన కొత్త లోనే దీనిపై ప్రభుత్వం లోతుగా సమీక్ష జరిపినట్లుగా సమాచారం.గత ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు వేరు వేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయ గా ఇప్పుడు వాటన్నింటినీ ఒకే ప్రాంగణంలోకి తీసుకు రావాలన్న సంచలన నిర్ణయం చేస్తోంది.ఈ నిర్ణయాన్ని అమలు చేయటంలో వచ్చే ఆచరణాత్మక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం.విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు,ప్రతికూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అవసరమయ్యే తరగతి గదులు,హాస్టళ్లు,అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, సిబ్బందికి క్వార్టర్స్ తదితరాలన్నింటిపై సూదీర్ఘంగా చర్చించారు.ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కొత్తగా భవనాలను నిర్మించాల్సి ఉండగా.. అన్నింటినీ ఒకేలా డిజైన్ చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు.ఆ ప్రకారమే అధికారులు కొన్ని డిజైన్లు సిద్ధం చేయగా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,సీఎస్ శాంతికుమారి తదితరులు పరిశీలించారు.ఈ కొత్త పథకానికి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్,మధిర అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.మొదట ఆ రెండు నియోజకవర్గాల్లోనే ఈ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి ఆ తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !