నేటి గదర్ న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలొ గల సీతంపేట బయ్యారం పినపాక గ్రామాలలో గల ఎరువుల దుకాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వి బాబురావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసినటువంటి ప్రతి వస్తువుకు బిల్లులు ఇవ్వాలని ఎరువుల దుకాణ యజమానులకు సూచించారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు అనంతరం ఎమ్మార్పీ ధరలకే పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు అమ్మాలి అన్నారు. అధిక ధరలకు అమ్మిన యెడల వారి దుకాణాల లైసెన్సును చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఏవో వెంకటేశ్వర్లు, కరకగూడెం మండల ఏవో చటర్జీ, అశ్వాపురం మండల ఏవో సాయి శాతన్, పినపాక మండలం వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 45