– బాధితుని కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా.. తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి సిపిఎం పార్టీ డిమాండ్
నేటి గదర్, జూన్ 25,
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్, 6281272659:
ములుగు జిల్లా మల్లంపల్లి సబ్ స్టేషన్ పరిధిలోని మామిడి రేవు తండా గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్ తో గుగులోత్ బాలరాజ్ ( 35) మృతి చెందాడు.
కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతోనే జరిగిందని సిపిఎం పార్టీ ములుగు మండల కార్యదర్శి ఎం.డి గఫూర్ పాషా టౌన్ కార్యదర్శి కొర్ర రాజు అన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ గిరిజన తండాలలో లెవెన్ కె.వి వైరు గ్రామములోకి వెళ్లే వైర్ల మీద ఆనుకొని ఉన్నందువల్లనే ఈ యొక్క విద్యుత్ శాక్మరణం జరిగిందని తండాలలో ట్రాన్స్ఫార్మర్లకు ఆన్ ఆఫ్ సౌకర్యం లేవని అదేవిధంగా కరెంట్ అధికారులు మారుమూల తండాలు పల్లె ప్రాంతాలను పట్టించుకోవడంలేదని అన్నారు. కరెంటులు సమస్య వస్తే స్థానికంగా ఉన్నవారే ఎవరో ఒకరు కరెంటు రిపేరు చేసుకునే పరిస్థితి ఉన్నదని అలాంటి తరుణంలోనే ఇలాంటి విద్యుత్ మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.
చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకొని 25 లక్షలు ఎక్స్ గ్రే షియా తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ కార్యక్రమంలో
టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోరిక గోవింద నాయక్, మాజీ సర్పంచి గుగులోతు తిరుపతి,సిపిఎం పార్టీ నాయకులు, రత్నం ప్రవీణ్, గూగులోతు రమేష్, జన్ను దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.