నేటి గద్దర్ న్యూస్, బోనకల్/ మధిర :
మధిర రైల్వే స్టేషన్ కు ఉత్తర భాగమున, మధిర బస్టాండ్ కు దక్షిణ భాగమున, మధిర రైల్వే స్టేషన్ నుండి నిదానపురం పోయే తారు రోడ్డు ప్రక్కన ఉన్న మురికిగుంట పాదచారులను, వాహనదారులను దుర్వాసనతో, మురికి కంపుతో ఇబ్బంది పెడుతుంది. వివరములు ఇలాగ ఉన్నాయి. బస్టాండు లెట్రిన్ ట్యాంకుల నుండి వచ్చే అపరిశుభ్ర నీరు, మురికి నీరు అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వచ్చి గుంట లాగా ఏర్పడి, గుంట నిండి ఉండటం వలన అటు బస్సు ప్రయాణికులను, రైళ్ల ప్రయాణికులను, ప్రక్కన ఉండే ఊళ్ళకు పోయే ప్రయాణికులను ఈ దుర్వాసన ఇబ్బందికరంగా ఉంది. కావున బస్టాండుకు సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి మంచి వాతావరణం సృష్టించవలసినదిగా ప్రజలు కోరుతున్నారు.
Post Views: 26