★విద్యార్థులకు స్కూల్ బ్యాగులు,నోట్ పుస్తకాలు డ్రాయింగ్ కిట్స్ పంపిణీ
నేటి గద్దర్ కరకగూడెం: విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కలుగుతుందని ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని గొల్లగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఆ పాఠశాల విద్యార్థులతో పాటు రంగాపురం,గొల్లగూడెం అంగన్వాడీ చిన్నారులకు,నర్సాపురం వలస ఆదివాసీ,రంగాపురం ఎస్సి కాలనీ విద్యార్థులకు మొత్తం 70 మందికి స్కూల్ బ్యాగులు,నోట్ పుస్తకాలు,పలకలు డ్రాయింగ్ కిట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధనతో కష్టపడి చదివితేనే విజయం సాధించగలరని ఎవ్వరూ కూడా సమయాన్ని వృధా చేయరాదని పేర్కొన్నారు.ప్రాథమిక స్థాయి నుండే లక్ష్యంవైపు అడుగులు వేసే విద్యార్థులకు భవిష్యత్తులో విజయావకాశాలు ఎక్కువగా దక్కుతాయిని, విద్యార్థి దశ నుంచే ఉన్నత విలువలతో కష్టపడి మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా
ప్రజల అవసరాలను గుర్తించి రానున్న రోజుల్లో పేద ప్రజలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఇర్ప క్రిష్ణయ్య,గ్రామస్థులు,గుండ్ల రంజిత్ కుమార్,ఫౌండేషన్ సభ్యులు సమీర్ తదితరులు పాల్గొన్నారు.