+91 95819 05907

అభిమానులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు

– సినిమా టికెట్ల దోపిడీని అరికట్టండి
– ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహణ
– అద్వాన్నంగా సినిమా ధియేటర్స్    
– అధికారులు చర్యలు తీసుకోవాలి 
– ఎస్ కె అజీమ్, ప్రధాన కార్యదర్శి, టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 

నేటి గదర్, జూన్ 26,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశి 9052354516 :

భద్రాచలంలో ఈ నెల 27న రిలీజ్ అవ్వబోతున్న కల్కి సినిమాకు ఎప్పుడు లేని విధంగా హైదరాబాదులో ఐమాక్స్ థియేటర్లో రేటు కన్నా ఎక్కువగా రూ.375లు ఒక షోకు తీసుకుంటూ అభిమానులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎస్ కె అజీమ్ ఆరోపించారు. బుధవారం భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో సినిమా టికెట్లపై అధిక రేట్లు తగ్గించాలని, సినిమా థియేటర్ యాజమాన్యాలు ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా థియేటర్ నడిపించాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో కి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా థియేటర్ యజమానులు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుతున్నారని మండిపడ్డారు. సామాన్య మానవుడు అభిమాన హీరో సినిమా చూడాలంటే రూ.375లు అంటే అసలు చాలామందికి సాధ్య పడదు తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన జీవోలో 75 రూపాయలు పెంచమని ఉంది కానీ నిబంధనలకు విరుద్ధంగా భద్రాచలం థియేటర్ యజమానులు 375 రూపాయలు పెంచడం జరిగిందని, అదే కాకుండా ఆన్లైన్లో పెడుతున్నారంటే పేర్కొన్నారు. దీంతో అదనంగా రూ.30లు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. థియేటర్లు చూస్తే అంతంత మాత్రమే, పేరుకు మాత్రమే ఏసిగా, ఏసీ హాల్లో కనీసం గాలి కూడా రాని పరిస్థితి, ఘోరమైన సీట్లు ఏర్పాటు నెలకొని ఉన్నాయని వెల్లడించారు. సీట్ మీద కూర్చుంటే చేతులకు, కాళ్ళకి దెబ్బలు తలిగే దుస్థితి స్థానికంగా నెలకొనే ఉందని ఆరోపించారు. టాయిలెట్లు అద్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. భద్రాచలంలో ఆన్లైన్లో టికెట్స్ విక్రయం వ్యవస్థను తీసివేసి, టికెట్లు బుకింగ్ లోనే అమ్మాలని, ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ రేట్లకు టికెట్లు విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు భద్రాచలం సినిమాహాల్స్ ను తనికీ చెయ్యాలని, తగు విచారణ చేపట్టాలి, అభిమానులకు జరుగుతున్న అన్యాయంను అరికట్టాలి ఆయన కోరారు. 

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !