+91 95819 05907

ప్రజలకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్న సర్కార్…

2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు…

ప్రతి మహిళకు నెలకు రూ…2500…

నేటి గదర్ న్యూస్,(స్టేట్ బ్యూరో) హైదరాబాద్ జూన్ 26:
నైనారపు నాగేశ్వరరావు ✍️

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కోక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది.అధికారంలోకి రాగానే
ముందుగా వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది.ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. గృహజ్యోతి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పాటు రూ. 500లకే గ్యాస్ సిలిండర్ హామీలను ప్రారంభించారు.ఈ ఏడాది 2024,మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు హామీలు అందుబాటులోకి వచ్చాయి.మహాలక్ష్మి పథకంలో మరో స్కీం పెండింగ్‌లో ఉంది.అదే 18 ఏళ్లు నిండిన మహిళలందరికి నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకం త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నట్లుగా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రకటించింది.అలానే తెల్ల రేషన్‌ కార్డుల మంజూరుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.పెండింగ్‌ హామీల అమలకు రెడీ అయ్యింది క్రాంగెస్‌ సర్కార్‌.ఇన్నాళ్లు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో పలు హామీల అమలు ఆగిపోయింది.ఇప్పుడు అది పూర్తవ్వడంతో హామీల అమలు దిశగా అడుగులేస్తోంది కాంగ్రెస్ సర్కార్.పలు హమీల అమలుకు సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేస్తోంది.ఈ క్రమంలో మరో రెండు నెలల్లోగా జూలై,ఆగస్టు నాటికి మహిళలకు నెలకు 2500 రూపాయలతో పాటుగా తెల్ల రేషన్‌ కార్డుల మంజూరు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.రానున్న రెండు నెలల్లోగా ఈ స్కీమ్ అమలు చేయాలని సర్కార్‌ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయబోయే అనేక పథకాలకు తెల్ల రేషన్‌ కార్డు కీలకం కానుంది.అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.18 ఏళ్ళు నిండిన ప్రతి పేద మహిళకు ఈ స్కీం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారట.మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డుతో లింక్ ఉండటంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ స్కీం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది.ఇక రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది.నిజానికి తెల్ల రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రెండు నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలగనుంది.అలానే మహాలక్ష్మి స్కీమ్ అందరికీ వర్తించకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !