+91 95819 05907

మంత్రి పొంగులేటి చొరవతో ఈనెల 28న మెగా జాబ్ మేళా

– 60 కంపెనీల తరఫున కూసుమంచిలో నిర్వహణకు కసరత్తు
– 5,000మందికి ఉద్యోగ కల్పన లక్ష్యం

నేటి గదర్ ,జూన్ 26 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

ఉన్నత విద్యను అభ్యసించి కొలువులు రాక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. వారికి కొలువుల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నారు. గతంలో టీజీఎస్టీఈపీ చైర్మన్ కు మంత్రి లేఖ రాసి ఉద్యోగాలు కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించగా.. స్పందించిన సంస్థ భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమైంది.

★జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యలో

ఈ నెల 28వ తేదీన కూసుమంచిలోని బీవీ.రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఇందుకోసం 60కు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై.. 5,000మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు కల్పించనున్నారు. 7వ తరగతి నుంచి మొదలు.. 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ టెక్, ఎం టెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ విద్యార్హత వరకు వారి స్థాయిలో తగిన కొలువులు చూపనున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారు అర్హులని సంస్థ పేర్కొంది.

★విభిన్న రంగాల్లో… అనేక అవకాశాలు

రాష్ర్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో డ్రైవర్ మొదలు.. ప్రతిష్టాత్మక కంపెనీల్లో అనేక ఉద్యోగాలు లభించనున్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటీ విభాగం, మార్కెటింగ్ తదితర రంగాల్లో అభ్యర్థుల అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇంత భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతుండడంతో.. నిరుద్యోగ అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు మంత్రి పొంగులేటి చొరవ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !