పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలి..
Go నెం 51 రద్దు చెయ్యాలి…
మల్టీ పర్పస్ విధానం రద్దు చెయ్యాలి…
AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్.
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి/ అశ్వాపురం జూన్ 27:
అశ్వాపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయితీలలో కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటీ ప్రసాద్ డిమాండ్ చేశారు.గురువారం ఉదయం స్థానిక యూనియన్ కార్యాలయంలో యెడల్లి శ్రీను అధ్యక్షతన జరిగిన మండల స్థాయి గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,Go నెం 51 ని రద్దు చెయ్యాలని మల్టిపర్పస్ విధానం రద్దు చెయ్యాలని కనీస వేతనం అమలు చెయ్యాలని ప్రతి కార్మికునికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్,md యూసఫ్,
సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్,
ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు రాయపూడి రాజేష్,
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈనపల్లి పవన్ సాయి,
ఏఐఎస్ఎఫ్ పినపాక నియోజకవర్గం కార్యదర్శి అక్కినపల్లి నాగేంద్రబాబు,
సిపిఐ నాయకులు మేలపుర సురేందర్ రెడ్డి,రెడ్డిబోయిన వెంకన్న,యడెల్లి శ్రీను,తిప్పరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.