+91 95819 05907

ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు లో డ్రైనేజీ వెతలు

★ప్రధాన రహదారి కి R&B 2012లో డ్రైనేజీ ఏర్పాటు

★కలక్రమేనా ఆక్రమణలతో డ్రైనేజీ కనుమరుగు

★డ్రైనేజీ పైన ఐదు,ఆరు ఫీట్ల మేర మట్టి

★గత కొన్ని రోజులుగా JCB తో డ్రైనేజీ పై మట్టి తొలగిస్తున్న పంచాయతీ అధికారులు

★డ్రైనేజీ పై మరల గోతులు.

★నిల్వ ఉంటున్న బురద నీరు

★అసలే వర్ష కాలం

★శీతాకాలం లేదా వేసవిలో చేపడితే బాగుండు

★గోడు వెళ్లబోస్తున్న చిరు వ్యాపారులు
★పొంచి ఉన్న ప్రమాదం
★ఇంటి యజమానులు తురలు తెచ్చుకుంటే సహకరిస్తాం

★ఈ.బయ్యారం పంచాయతీ సెక్రటరీ జై పాల్ రెడ్డి

నేటి గదర్ న్యూస్, పినపాక: ఆ అధికారుల నిర్ణయం అభినందించాల్సిందే…గత 12 సంవత్సరాల డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నడుము బిగించారు… ముందస్తుగా ఆక్రమణ దారులకు నోటీసులు ఇచ్చారు. పనులు ప్రారంభించారు.కానీ పాత సమస్య కు పరిష్కారం లభించక పోను… కొత్త సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నది. వివరాలు ఇలా ఉన్నాయి.పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పంచాయతీ ఏడూళ్ల బయ్యారం, క్రాస్ రోడ్డు లో ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండడం తో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ పంచాయతీ అధికారులు డ్రైనేజీ పై ఆక్రమణ దారులు మట్టి పోయడం దానిని తొలిగించే కార్యక్రమం గత మూడు రోజుల క్రితం ప్రారంభించారు.ఈ క్రమంలో 2012 లో R&B అధికారులు ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు నుండి డా. శ్రీ రాం ఇంటి వరకు…అవతలి వైపు ఓ హోటల్ వరకు డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ఏడూళ్ల బయ్యారం పోలీసు స్టేషన్ సమీపంలో నిర్మించిన డ్రైనేజీ కొద్దీ రోజులకే కూలీ పోయింది. మరల దానిని పట్టించుకున్న నాథుడే లేడు. ఆనాడు క్రాస్ రోడ్డు లో పోలీస్ స్టేషషన్ , కేవలం మూడు ,నాలుగు గృహాలు మాత్రమే ఉండేవి. ఈ 12 సంవత్సరాల కాలంలో ఏడూళ్ల బయ్యారం అభివృద్ధి చెందింది. BTPS థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చెయ్యడం తో పలువురు బిల్డింగ్స్ నిర్మించడం జరిగింది.దూర ప్రాంతాల నుండి అద్దెలు చెల్లిస్తూ… వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నారు.

💥క్రాఫ్ట్ రోడ్ లో డ్రైనేజీ కష్టాలకు ఇదే కారణం💥

BTPS రావడం, హైవే రోడ్డు కి మార్కింగ్ ఇవ్వడంతో ఆయా సందర్భాలను బట్టి కొంతమంది ప్రధాన రహదారికి 20 ఫీట్ల ముందు ఇంటి నిర్మాణం చేపడితే, మరికొంతమంది 25 ఫీట్లు, ఇంకొంతమంది 30 ఫీట్ల దూరంలో ప్రధాన రహదారికి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ పద్ధతి పాటించకుండా ఎవరి ఇళ్ళ ముందు వారే తూరలు వేసుకున్నట్లు సమాచారం. అధికారులు దృష్టి సారించకపోవడంతో కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు డ్రైనేజీ పై స్లాబ్స్ పోసి దానిపైన ఆరేడు ఫీట్ల వరకు మట్టి పోయడం జరిగింది. ప్రస్తుతం జెసిబి లతో డ్రైనేజీ పై మట్టిని తొలగిస్తున్న దృశ్యాలను గమనించినట్లయితే ఇదే విషయం తేట తెల్లం అవుతుంది.

💥వర్షాకాలంలో కాకుండా వేసవికాలంలో డ్రైనేజీ పై మట్టి తొలగిస్తే బాగుండు💥

ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో జిల్లా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో డ్రైనేజీ పై మట్టి తొలగించే పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాత సమస్యకు పరిష్కారమేమో గాని కొత్త సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం లేకపోలేదు. వర్షాలు కురుస్తుండడంతో డ్రైనేజీ పై తీసిన మట్టి మూలంగా గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ఈ గుంతలు 15 ఫీట్ల వరకు ఉన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. దీనితో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గుంతలలో ఎవరైనా పడిపోయిన, ఏదైనా ప్రమాదం సంభవించిన ఎవరు బాధ్యత వహించాలని భయాందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలకు ఏదైనా జరగకూడనిది జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న స్వస్థత తరుణంలో కాకుండా కాస్త సమయం తీసుకుని శీతాకాలంలో కానీ, వేసవికాలంలో కానీ డ్రైనేజీ పనులు నిర్వహిస్తే బాగుంటుందని ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ ప్రజలు తమ అభిప్రాయం వెలుబుచ్చారు. హైవే మంజూరై మార్కింగ్ ఇచ్చినప్పటికీ అధికారులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు అని వారు ఆవేదన వెలిబుచ్చారు.

💥 వ్యాపారస్తులకు ఇక్కట్లు💥

వేల రూపాయల అద్దెలు చెల్లిస్తూ. .. ఏడుళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు డ్రైనేజీ పనులు ఇబ్బందిగా మారాయి. పాఠశాలలు తెచ్చుకోవడం, వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ప్రస్తుతం వారికి వ్యాపారం జరిగే సీజన్. ఈ సమయంలోనే డ్రైనేజీ ప్రారంభించడంతో అటు పార్కింగ్ కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో వారున్నారు. సంపాదన దేవుడెరుగు కానీ వేల రూపాయల షాపు అద్దె ఎలా చెల్లించాలని ఆవేదనతో ఉన్నారు.

🔥ఎమ్మెల్యే పాయం దృష్టి కి డ్రైనేజీ సమస్య🔥

ఏడుల బయ్యారం క్రాస్ రోడ్డులో వర్షాకాలంలో డ్రైనేజీకి మరమ్మతులు చేపట్టడం మూలంగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి అక్కడి వ్యాపారస్తులు ,కాంగ్రెస్ నాయకులు తీసుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాయం శుక్రవారం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ ని సందర్శిస్తారని సమాచారం.

★గృహ యజమానులు తూరలు వేసుకుంటే సహకరిస్తాం:పంచాయతీ సెక్రటరీ జై పాల్ రెడ్డి★

గృహ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు తూరలు తెచ్చుకుంటే సహకరిస్తామని ఏడూళ్ల బయ్యారం పంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డి నేటి గధర్ న్యూస్ కి తెలిపారు.

💥ఇకనైనా శాశ్వత పరిష్కారం ఆలోచిస్తే బాగు💥

ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాదాచారులు, వాహనదారులు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కట్లు పడింది వాస్తవం. మేడారం జాతర సమయంలో రోడ్లు వెడల్పు చేసిన సందర్భంలో డ్రైనేజీ సమస్యలపై దృష్టి సారించి ఉంటే నేడు ఈ సమస్య ఉత్ప అయ్యేది కాదు. అధికారులు ఇకనైనా శాశ్వత పరిష్కారం చూపెట్టాలి.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 18

Read More »

 Don't Miss this News !