★ప్రజా పాలనలో భాగంగా పల్లె దవాఖాన సేవలను పరిశీలించిన మంత్రి సీతక్క
నేటి గదర్, జూన్ 28,
ములుగు జిల్లా ప్రతినిధి,
కౌశిక్, 6281272659✍️✍️
సీజనల్ వ్యాధుల పట్ల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని మంత్రి సీతక్క ఆదేశించారు.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క రోగులకు అందుతున్న వైద్య సేవల విషయమై అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పల్లె దవాఖాన ను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. తదనంతరం పల్లె దావఖానలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను పేదోళ్లకి అందుతున్న వైద్య సేవలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగాజిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా , జిల్లా అధికార యంత్రాంగం, సీతక్క అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 231