◆పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
◆గోదావరి ముప్పు ప్రాంతాలపై పరిశీలన
◆పల్లె దవాఖానాలలో నాణ్యమైన వైద్యం అందించాలి.
నేటి గద్దర్ , ఏటూర్ నాగారం :
ములుగు జిల్లా వ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో ఏటూర్ నాగారం, మంగపేట మండలాలు పలు గ్రామాలలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం పర్యటించారు. మంగపేట మండల కేంద్రంలో నాబార్డ్ నిధులు కోటి 29 లక్షల రూపాయలతో పది సెంటర్స్ తో నిర్మించిన రైతు సేవా సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని మంత్రి సీతక్క, కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా ప్రారంభించారు. ఏటూర్ నాగారం మండలం రామన్నగూడెం గ్రామం పరిధిలో గోదావరికి కరకట్టను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారి చేశారు. గోదావరి నది ముంపు ప్రాంతాలలో ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏటూర్ నాగారం మండలంలో పల్లె దావకానాలను పనితీరుపై పరిశీలించినట్లు తెలిపారు. మంత్రి సీతక్క పర్యటనలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, పలువురు అధికారులు పాల్గొన్నారు.