నేటి గద్దర్ న్యూస్, పాడేరు :
అల్లూరి జిల్లా పాడేరు జూన్ 29 : 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణపు పనులను జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ శనివారం పరిశీలించారు. వైద్య విద్యార్ధుల తరగతి గదులు, ల్యాబ్ రేటరీలు, బాలురు, బాలికల వసతి గృహాలు, బోధనా తిరగతి గదులు నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణాలను తనిఖీ చేసి పనులు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేసారు. భవన నిర్మాణాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని ఏ అవసరం వచ్చినా వెంటనే తనను సంప్రదించాలని సూచించారు. పనులు నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పటిష్టమైన నాణ్యతలు పాటించాలని ఆదేశించారు. ముందుగా వైద్య కళాశాల నిర్మాణ మ్యాప్ లను పరిశీలించారు
ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ హైమావతి, ఎపి ఎస్ ఎం ఐడిసి . ఈ ఈ అచ్చం నాయుడు, తాహశీల్దార్ కల్యాణ చక్రవర్తి, ఎంపిడి ఓ, సాయి నవీన్, ఎ ఇ సురేష్ తదితరులు పాల్గొన్నారు.