వ్యవసాయం అనే పదం లోనే సాయం ఉంది
అగ్రికల్చర్ అనే మాట లోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని
సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న
ప్రపంచ వ్యవసాయ దినోత్సవం సందర్బంగా,నేటి గదర్ కవర్ స్టోరీ. ప్రపంచానికి అన్నం పెట్టెది వ్యవసాయం.
భారత జనాభాలో నేటికీ దాదాపు 60శాతం ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. హరిత, శ్వేత, నీలి తదితర విప్లవాల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాయి. పంటల దిగుబడి అధికమైంది. అయితే, భారత్‌లో అన్నదాతల ఆదాయం మాత్రం పెరగలేదు. నేటికీ సరైన మద్దతు ధర కోసం రైతులు, ఎన్నో పోరాటాలు, నిరసనలు, ధర్నా లు చేస్తూ,కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా వరి, మిరప, పత్తి, కూరగాయల, అనేక రకాల పంటలు ను సాగు చేస్తూ రైతులు జీవనం సాగిస్తునారు.