★ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్
నేటి గదర్ న్యూస్,
భూమి సమస్యను తన ఆజెండా పైకి తెచ్చిన కామ్రేడ్ దొడ్డు కొమరయ్య 78వ వర్ధంతి ప్రదర్శన సదస్సు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జూలై 4న జరగనున్నదని దీనికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ పిలుపు నివ్వడం జరిగింది.ఆయన చర్ల మండలం కలివేరు లో శనివారం
మాట్లాడుతూ… నిజం రాచరిక భూస్వామ్య వ్యవస్థ పునాదివినగా ఉన్న ఆ రోజుల్లోనే తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించి భూములను భూస్వాముల చేతుల్లోంచి ప్రజలకు పంచి పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరవీరుడిగా కామ్రేడ్ దొడ్డి కొమరయ్య చరిత్రలో నిలిచిపోయారని ఆయన అన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా భూమి సమస్య అలానే ఉందని భూమి సమస్యను పరిష్కరించిన దశలో ఏ ప్రభుత్వాలు లేవని ఆయన అన్నారు. ఇంకా భూమి భుక్తి విముక్తి కోసం పోరాటాలు సాగుతూనే ఉన్నాయని వారన్నారు. 1946 నుండి 52 వరకు సాయుధ పోరాటంలో 4,000 మంది ప్రాణాలు కోల్పోయారని 2000 గ్రామాలు ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయని 10 లక్షల ఎకరాల భూములను ప్రజలు స్వాధీన పరుచుకున్నారని కుల మతాల కచ్చితంగా ప్రజలు ఐక్యమై ఈ పోరాటం కొనసాగించారని వారు అన్నారు దొడ్డి కొమరయ్య వారసత్వంతో అనేకమంది గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల రూపంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం రామ నరసయ్య కట్ట నరసింహారెడ్డి విక్రమ్ అన్న లింగన్న కోటన్న బాటనలు కాచినపల్లి ఎన్కౌంటర్లు ఇలా ఎంతోమంది తమ అమూల్యమైన ప్రాణాలను ఈ విప్లవద్యమంలో అర్పించారని వారన్నారు. వారి ఆశయ సాధనలో నేడు మలిదశ పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ దొడ్డి కొమరయ్య వర్ధంతి సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నారని దీనికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు ఇర్ఫా సమ్మక్క సబ్కా నగేష్ రవి రాజు రుక్విని సబ్కా నాగలక్ష్మి శ్రీదేవి రవణ బాయమ్మ తదితరులు పాల్గొన్నారు..