మంత్రి పొంగులేటి పెద్ద మనస్సు… మంత్రి సహకారం తో పద్మ శ్రీ సకిని రామచంద్రయ్య దశదిన కర్మలకు రూ.2లక్షల ఆర్ధిక సహాయం
★బాధిత కుటుంబానికి అందజేసి పినపాక MLA పాయం
నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్:
✍️తెగడం పుడి వెంకట రమణ
మరో మారు మంత్రి పొంగిరేటి శ్రీనివాసరెడ్డి తన మంచి మనసును చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య చివరి దశలో అనారోగ్య సమస్యలతో మంచం పట్టి మృతి చెందిన విషయం విధితమే. సకిని రామచంద్రయ్య కుటుంబాన్ని ఇటీవలే మంత్రి పొంగులేటి పరమార్శించడం జరిగింది. ఆ సందర్భంలో రామచంద్రయ్య కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 2 లక్షల రూపాయలను … పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూనవరంలోని సకిని స్వగృహంలో సకిని కుమారుడు సకిని బాబూరావు, కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే మంత్రి సూచన మేరకు పద్మశ్రీ సకిని రామచంద్రయ్య కుటుంబానికి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీగా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే పాయం కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గత ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ సహాయం కూడా తక్షణమే మంజూరయ్యేలా చూడాలని వారు ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూనవరం ఎంపీటీసీ గుడిపుడి కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.