నేటి గద్దర్ పాడేరు న్యూస్:
అల్లూరి జిల్లా పాడేరు జూలై 1 : జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఎన్టీ ఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసారు. స్థానిక సండ్రుపుట్టు కాలనీలో సోమవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసారు. పోతల కొండమ్మ అనే వృద్ధురాలుకు రూ.7 వేలు స్వాముల మణి కంఠ అనే దివ్యాంగునికి రూ. 6 వేలు పింఛను నగదు పంపిణీ చేసారు. పింఛను ఎంత వచ్చిందని లబ్దిదారులను ప్రశించారు. రేషన్ అందుతోందా ? ఎన్ని కిలోలు బియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసు కున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది, పిల్లలు ఎక్కడ ఉంటారని వృద్ధురాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డి. ఆర్. డి. ఏ, పి.డి. వి.మురళి, ఎం.పి.డి. ఓ, సాయి నవీన్, ఇ ఓ పి ఆర్ డి రమేష్, సచివాయలం సిబ్బంది, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 54